ఇటీవల గుజరాత్ లో ఓ మహిళ తన భర్త మగాడు కాదని పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత పోలీసులను ఆశ్రయించింది. ఆ ఘటన మరవకముందే ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది మధ్యప్రదేశ్‌లో. గ్వాలియర్ లో ఓ వ్యక్తి తన భార్య ఆడది కాదని.. మగాడని పెళ్లైన ఆరేళ్ల తర్వాత ఫిర్యాదు చేశాడు.
గ్వాలియర్‌కు చెందిన యువకుడికి మురైనాకు చెందిన యువతితో 2016లో వివాహం జరిగింది. అప్పటినుంచి వారిద్దరి మధ్య శారీరక సంబంధం లేదు. ఆ యువకుడు అడిగినా ఆమె ఒప్పుకోలేదు. ఆరేళ్ల తర్వాత తన భార్య మహిళ కాదని పురుషుడని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించాడు.
తనకు హార్మోన్ సమస్య ఉండడం వల్లే ఇలా ఉన్నాని ఈ సమస్యకు చికిత్స తీసుకుంటున్నానని మహిళ తెలిపింది. అయినా అనుమానం తీరని భర్త వైద్య పరీక్షలు చేయించాడు. ఫలితంగా ఆమె పురుషుడని తేలింది. దీనిపై విచారించిన కుటుంబ న్యాయస్థానం ఈ వివాహాన్ని రద్దు చేసింది.