1.5 లీట‌ర్ల వోడ్కాను శ‌రీరంలోకి ఎక్కించుకున్నాడు.. త‌రువాత ఏమైందంటే..?

-

నిర్దిష్ట‌మైన మొత్తంలో ఫుడ్‌ను నిర్దిష్ట‌మైన టైమ్‌లోగా లాగించేస్తే భారీ బ‌హుమ‌తి ఇస్తాం.. అని చెప్పి కొంద‌రు అప్పుడ‌ప్పుడు ఫుడ్ చాలెంజ్‌ల‌ను నిర్వ‌హిస్తుంటారు. ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను ఉంచి వాటిని టైమ్ లిమిట్ లోగా తినాల‌ని చాలెంజ్ చేస్తుంటారు. నిజానికి ఇవి కామన్‌. ఎక్క‌డైనా జ‌రుగుతూనే ఉంటాయి. అయితే ఆ వ్య‌క్తి కూడా ఇలాంటి ఓ చాలెంజ్‌లోనే పాల్గొన్నాడు. భారీ ఎత్తున డ‌బ్బు వ‌స్తుంద‌ని చెప్పి చాలెంజ్‌ను స్వీక‌రించాడు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ప్రాణాల‌ను కోల్పోయాడు.

ర‌ష్యాకు చెందిన యూరీ డుషెష్‌కిన్ అనే వ్య‌క్తి అక్క‌డ గ్రాండ్ ఫాద‌ర్‌గా పాపుల‌ర్‌. అత‌న్ని గ్రాండ్ ఫాద‌ర్ అని పిలుస్తారు. అయితే ఫ‌స్ట్ స్టెప్ యూ ట్యూబ్ అనే ఓ యూట్యూబ్ చాన‌ల్ వారు ఇటీవ‌ల ఓ ఫుడ్ అండ్ డ్రింక్ చాలెంజ్‌ను నిర్వ‌హించారు. అందులో భాగంగా వేడి వేడి పొగ‌లు క‌క్కే సాస్ ను తాగాల్సి ఉంటుంది. అది వ‌ద్ద‌నుకునేవారు పెద్ద మొత్తంలో ఆల్క‌హాల్ ను సేవించాల్సి ఉంటుంది.

అయితే యూరీ ఆల్క‌హాల్ చాలెంజ్‌ను స్వీక‌రించాడు. భారీ మొత్తంలో న‌గ‌దు ఇస్తామ‌ని చెప్ప‌డంతో అత‌ను ఆ చాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను సుమారుగా 1.5 లీట‌ర్ల వోడ్కాను శ‌రీరంలోకి ఎక్కించుకున్నాడు. అయితే వోడ్కాను అలా ఎక్కించుకున్న కొద్ది నిమిషాల్లోనే అత‌ను చ‌నిపోయాడు. దీంతో స‌ద‌రు ఈవెంట్‌ను నిర్వ‌హించిన యూట్యూబ్ చాన‌ల్‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి నిర్వాహ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైనా స‌రే ఇలాంటి చాలెంజ్‌ల‌ను స్వీక‌రించే ముందు ప్రాణాపాయం గురించి ఆలోచించాలి. లేదంటే ఇలాగే జ‌రుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version