చెన్నైలో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను 555 పరుగుల వద్ద కొనసాగిస్తున్న విషయం విదితమే. రెండు రోజులుగా ఆడుతున్న ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 555 పరుగులు చేసింది. అయితే పిచ్ నుంచి ఏమాత్రం సహకరించకపోవడంతో భారత బౌలర్లు తీవ్ర నిరాశకు గురయ్యారు.
కాగా ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సమయంలో టీ బ్రేక్ కు ముందు బౌలర్లకు కాసేపు విశ్రాంతి ఇద్దామని భావించిన కెప్టెన్ కోహ్లి రోహిత్‌ను బౌలింగ్ వేయమన్నాడు. దీంతో రోహిత్ స్పిన్ బౌలింగ్ వేశాడు. అయితే ఓవర్ చివరి బంతిని అతను వెరైటీగా వేశాడు. స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ శైలిని రోహిత్ అనుకరించాడు. అలా అనుకరిస్తూ ఆ బంతిని బౌల్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rohit Sharma 🤝 Harbhajan Singh pic.twitter.com/Tb7tnrN6k2
— Arshu (@arshu_it) February 6, 2021
అయితే మరోవైపు చెన్నై పిచ్ మరీ పేలవంగా ఉండడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బౌలర్లకు అసలు ఏ మాత్రం సహకరించని ఆ పిచ్‌ను ఎలా తయారు చేశారంటూ అభిమానులు బీసీసీఐతోపాటు క్యురేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్ ఆదివారం తన తొలి ఇన్నింగ్స్‌ను మధ్యాహ్నం వరకు ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.