కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ ఇప్పుడు అనేక పరిశోధనలు జరుగుతూ వస్తున్నాయి. కరోనా కట్టడిలో ఎవరికి వారుగా తమ వంతుగా చేయిత అందిస్తున్నారు. వైరస్ ని కట్టడి చేయడంలో ఎప్పుడు ఏదోక పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఒక ఇంజనీరింగ్ విద్యార్ధి తన పరిశోధనలో ఒక కీలక వస్తువుని కనిపెట్టాడు. వేసవి కాలంలో మనం ఎక్కువగా చేతిని మొహం మీద పెడుతూ ఉంటాం.
దీనిని కట్టడి చేయడానికి గానూ నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని ఎన్జీవో కాలనీకి చెందిన శ్రీరామదాసు ధర్మసాయి ఒక కొత్త టోపీ కనిపెట్టాడు. అతను ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్నాడు. ముఖాన్ని చేయితో తడుముకోకుండా హెచ్చరించే విధంగా ఒక టోపీని తయారు చేసాడు. కరోనా రాకుండా ఉండాలి అంటే చేత్తో ముఖాన్ని పదే పదే తాకకుండా ఉండాలి.
ముక్కు, నోరు, కళ్లను తాక కూడదని వైద్యులు పదే పదే చెప్తున్నారు. అయినా సరే అలవాటులో పొరపాటుగా మన మొహం మీదకు చేయి వెళ్తుంది. పొరపాటున చేతులు ముఖం వద్దకు వెళ్లినా హెచ్చరించేలా, చేయి ముఖం దగ్గరకు వెళ్లగానే టోపీకి అమర్చిన అలారం మోగడంతో పాటు ఎర్రబల్బు వెలుగుతుంది. సెన్సర్, శబ్దం రావడానికి బజర్, అవి పనిచేయడానికి బ్యాటరీని అమర్చాడు. తనకు 200 వరకు ఖర్చు అయింది అన్నాడు.