ఆంధ్రప్రదేశ్ లో పేదలకు రేషన్ ఇవ్వడానికి గానూ ఏపీ ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రేషన్ సరుకులను అందించాలి అని జగన్ ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం మే నెల మొదటి విడత రేషన్ పంపిణీని పౌరసరఫరాల శాఖ బుధవారం నుంచి మొదలుపెడుతున్నారు. ఈనెల 29 నుంచి మే 10వ తేదీ వరకు సరుకులు అందిస్తారు.
గత రెండు విడతలలో ఏ విధంగా అయితే ఇచ్చారో ఇప్పుడ కూడా అదే విధంగా ఇస్తారు. పోయిన సారి కందిపప్పునకు బదులుగా శనగలు ఇచ్చారు. ఇప్పుడు కందిపప్పు ఇస్తారు. కోటీ 47 లక్షల కార్డులు ఉన్నాయి. ఇటీవల దరఖాస్తు చేసుకున్న వారిలో 81 వేల కుటుంబాలు అర్హులు అయ్యాయి. వారికి ఈ విడతలో రేషన్ అందుతుంది. రెండు విడతల్లో కార్డుదారులకు బదులుగా వీఆర్‌వోలే వేలిముద్రలు వేయగా…
ఈసారి మాత్రం కార్డుదారులు వేలిముద్ర వేస్తేనే రేషన్ ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర నిబంధల ఆధారంగానే ఇప్పుడు ఈ ప్రక్రియ చేపట్టారు. స్లిప్పులు పంపిణీ చేస్తామని, వాటిలో సూచించిన తేదీ, సమయానికి రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేసారు ఈ సారి. ఒక్కో షాపు లేదా కౌంటర్‌లో రోజుకు 30 నుంచి 40 మందికి మాత్రమే సరుకులు పంపిణీ చేస్తారు.