ఆడిస్తానంటూ పసిపాపను ఎత్తుకెళ్లి.. అమానుషం !

-

విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 19 ఏళ్ళ యువకుడు తల్లితో కలిసి ఉంటున్నాడు. అతని ఇంటి పక్కన ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ కుటుంబం ఉంటోంది. ఆ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల కూతురు తరచూ పక్కనే ఆ యువకుడి ఇంటికి వచ్చి ఆడుకునేది. రోజు మాదిరిగానే మొన్న ఉదయం యువకుడు పక్కింటికి వెళ్లి అక్కా పాపను ఆడిస్తానంటూ చిన్నారిని ఇంటికి తీసుకెళ్లాడు. అయితే అశ్లీల చిత్రాలకు బానిసయినన ఆ యువకుడు చిన్నారి మీద దారుణంగా అత్యాచారం చేశాడు.

rape

కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగొచ్చిన చిన్నారి కడుపు నొప్పిగా ఉందని ఏడుస్తుండడంతో ఆమె కుటుంబ సభ్యులు ఏమైందని యువకుడిని ప్రశ్నించారు. అందుకు అతను పొంతన లేని సమాధానాలు చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చిన్నారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఏమీ తెలీకపోవడంతో అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ పాప మీద అత్యాచారం జరిగిందని చెప్పడంతో ఆమె తల్లిదండ్రుల గుండెలు పగిలినంత పనయింది. ఇంటికి వచ్చి ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేయడంతో వెంటనే సచివాలయం కానిస్టేబుల్‌కి సమాచారమిచ్చారు. ఆమె దిశ పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించడంతో దిశ డీఎస్పీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version