టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ సంచలన ప్రకటన చేశారు. కొత్త జీవితం ప్రారంభిస్తున్నానంటూ ప్రకటన చేశాడు. కొత్త సినిమాలతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నా..ఫిబ్రవరి నుంచి కొత్త సినిమాతో బిజీ అవుతున్నానంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
కొంత కాలంగా సినిమాలకు దూరం కావడానికి ఎన్నో కారణాలున్నాయి…అందరూ బాగుండాలి, నా కొత్త జీవితం కూడా బాగుండాలని దర్గాలో ప్రార్థనలు చేశానని వెల్లడించారు మంచు మనోజ్. చాలా ఎళ్ళుగా పెద్ద దర్గాకు రావాలను కున్నా.. నా కుటుంబంలో అందరూ వచ్చారు. కానీ నేను ఇంతకాలం రాలేకపోయానని చెప్పారు. ఇక్కడ ప్రార్తన చేస్తున్నప్పుడు ఎంతో ప్రశాంతత కనిపించిందని స్పష్టం చేశారు టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్.