‘మా నాన్న కన్నా నన్ను ఎక్కువగా భయపెట్టే వ్యక్తి.. పెళ్లి రోజు శుభాకాంక్షలు..’ మంచు విష్ణు

-

టాలీవుడ్ హీరో మంచు విష్ణు, విరానికా పెళ్ళి జరిగి నేటికీ 14ఏళ్లు పూర్తయ్యాయి.. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక కొంటె ట్వీట్ ఉంచాడు ఈ హీరో..

మంచు విష్ణు, విరానికా 2009 మార్చి 1న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కూతురే వీరానికా. రాజారెడ్డి చివరి కుమారుడైన సుధాకర్ రెడ్డి కూతురు విరానికా రెడ్డి.. వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఎప్పటికప్పుడు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ వస్తున్నారీ జంట. వీరికి నలుగురు పిల్లలు కాగా వారిలో ఇద్దరు ట్విన్స్.. అయితే ఈ రోజుకి మంచు విష్ణు విరానికా మెడలో తాళికట్టి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా భార్యతో కలిసి ఉన్న ఫోటోలు పంచుకొని ఫన్నీగా ఒక కోట్ రాసుకొచ్చాడు విష్ణు.

“ఈ ప్రపంచంలోనే మా నాన్న కన్నా నేను ఎక్కువగా భయపడే ఏకైక పర్సన్..” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మంచు అభిమానులంతా వీరిద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు..

కాగా వీరి ప్రేమ గురించి ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పకు వచ్చిన మంచు విష్ణు తన భార్యను మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయానని.. ఆమెతో ఇన్నాళ్ళ తన ప్రయాణం ఎంతో ఆనందంగా గడిచిపోయిందని అలాగే ఐదు అడుగులే ఉన్నప్పటికీ కళ్ళతోనే మనుషుల్ని భయపెట్టి కంట్రోల్ లో పెట్టగలిగే సామర్థ్యం ఆమెలో ఉందంటూ భార్యపై ఉన్న ప్రేమను ఎన్నోసార్లు వ్యక్తం చేశాడు ఈ హీరో. ఏది ఏమైనా వీరిద్దరూ హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version