దిల్లీ లిక్కర్ స్కామ్.. ప్రస్తుతం దేశమంతా చర్చించుకుంటున్న విషయం ఇది. ఈ కేసులో అరెస్టయిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా తాజాగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఆయన.. జైల్లో పెట్టి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. ‘‘సర్.. మీరు నన్ను జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టగలరు. కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. బ్రిటిషర్లు కూడా స్వాతంత్ర్య సమరయోధులను ఇబ్బందులకు గురి చేశారు. వారి స్థైర్యాన్ని కదిలించలేకపోయారు’’ అని మనీశ్ సిసోదియా ట్వీట్ చేశారు.
శుక్రవారం సిసోదియా బెయిల్ పిటిషన్పై దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ తన వాదనలు వినిపిస్తూ ఈ స్కామ్లో సిసోదియాది ప్రత్యక్ష పాత్రేనని కోర్టుకు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. సిసోదియాను కస్టడీకి అప్పగించాలన్న ఈడీ అభ్యర్థనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆయనను ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించింది.
साहेब जेल में डालकर मुझे कष्ट पहुँचा सकते हो,
मगर मेरे हौसले नहीं तोड़ सकते,
कष्ट अंग्रेजो ने भी स्वतंत्रता सेनानियों को दिए,
मगर उनके हौसले नहीं टूटे।
– जेल से मनीष सिसोदिया का संदेश
— Manish Sisodia (@msisodia) March 11, 2023