క్రెడిట్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. రైలు ప్రయాణాలు చేసే వాళ్ళకి అయితే ఎస్‌బీఐ కార్డు అందించే ఐఆర్‌సీటీసీ కార్డు చాల ప్రయోజనం. మరి అసలు ఈ కార్డు గురించి, ఎలా ఉపయోగపడుతుంది..? ఇలా దీని గురించి పూర్తి వివరాలు మీకోసం. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే తెలుసుకోండి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో సేవలని అందిస్తోంది. SBIకు చెందిన అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్ కస్టమర్లకు పలు రకాల క్రెడిట్ కార్డులను అందిస్తోంది.
ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గమనించాలి. మామూలుగా క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే జాయినింగ్ ఫీజు చెల్లిస్తే చాలు. కానీ ఈ క్రెడిట్ కార్డును ఉచితం గానే పొందొచ్చు. ఎలాంటి జాయినింగ్ ఫీజు ఉండదు. కనుక ఈ అవకాశం వినియోగించుకుంటే ఉచితంగానే వస్తుంది. ఈ కార్డు ఉన్న వాళ్లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేస్తే ట్రాన్సాక్షన్ చార్జీ 1 శాతం పడదు. వెల్‌కమ్ గిఫ్ట్ కింద 350 బోనస్ పాయింట్లు కూడా మీకు లభిస్తాయి. అదే మీరు భాగస్వామ్య వెబ్‌సైట్లలో కొనుగోలు చేస్తే డిస్కౌంట్లు కూడా ఉంటాయి.