పామును చూస్తే మనం పరుగులు తీస్తాము. ఎక్కడ పాము మనల్ని కాటేస్తుందని భయ పడిపోతూ ఉంటాము. పాములు అంటే ఎవరికైనా భయమే కదా..? కొంత మంది పాము వలన ఇబ్బంది వస్తుందని కర్రనో లేదంటే పక్కన ఏముంటది తీసుకొని చంపడానికి చూస్తూ ఉంటారు. అయితే పాముల గురించి మనకి చాలా విషయాలు తెలియవు. అయితే సర్పాల గురించి ఈ సత్యాలను మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.
నిజానికి పాములు మనం అనుకున్నట్లుగా మనుషులు జోలికి రావు. ఎవరైనా మనిషి తన వద్దకి వస్తే భయపడి ఆత్మరక్షణ కోసం కాటేస్తాయి తప్ప మన మీద ఎటువంటి పగ పాములకు ఉండదు.
పైగా చాలా విషపూరితమైన పాములకి అవి విషపూరితమైనవి అని కూడా తెలియదు. ఒక్కోసారి పొరపాటుగా తమను తామే కాటేసుకొని కూడా చనిపోతూ ఉంటాయి.
పాములు నోటి ద్వారా వాసన చూస్తూ ఉంటాయి. అలానే వాసన ఎటు నుండి వస్తుంది అనేది కూడా వాటికి తెలుస్తుంది.
ఇది ఇలా ఉంటే పాములకి ఎండ చాలా అవసరం. ఎండ వాటికి ఎనర్జీని ఇస్తుంది. అలానే తిన్నది జీర్ణం కూడా అవుతుంది.
ఇండోనేషియా మలేషియా ప్రాంతాలలో అయితే లక్షల్లో కొండచిలువలను చంపేశారు ఈ పాములను చంపేసి వాటి ద్వారా ఫ్యాషన్ వస్తువుల్ని తయారు చేస్తున్నారట. నిజానికి పాముల ద్వారా మనుషులకి కంటే మనుషుల ద్వారా పాములకే హాని జరుగుతుందని క్లియర్ గా మనం చెప్పొచ్చు.