తిని పారేసే అరటి తొక్కతో.. ఇన్ని ఉపయోగాలా..?

-

చాలా మంది అరటి పండు తింటుంటారు. ఇది చాలా వరకూ ఆహరానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. అనేక పోషక పదార్థాలు ఉంటాయి. కానీ చాలా మంది పండు తినేసి తొక్క అవతల పారేస్తారు. కానీ ఈ తొక్కతో చాలా ఉపయోగాలు ఉన్న విషయం చాలా మంది గ్రహించరు.

అరటి తొక్కతో ప్రత్యేకించి చర్మ సౌందర్యాన్నికాపాడుకోవచ్చు. ఎలాగంటే.. కాలుష్యం, సూర్యకాంతి, దుమ్ము, ధూళి, తీసుకునే ఆహారం… ఇవన్నీ మన చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దాంతో చర్మం నల్లగా మారుతుంటుంది. అలాంటప్పుడు అరటిపండు తొక్క ఈ సమస్యలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది.

ఇందుకు మనం చేయాల్సిందల్లా.. అరటిపండు తొక్క, కొద్దిగా వంటసోడా, కాసిని నీళ్లు మిక్సీలో తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పూతలా రాసుకోవాలి. పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం పై మృత కణాలు తొలగిపోతాయి. ముఖచర్మం తాజాగా, కోమలంగా మారుతుంది.

అరటి తొక్కతో ఇంకో పని చేయొచ్చు.. అరటిపండు తొక్కను మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా కలబంద గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసి… పదినిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారంలో నాలుగుసార్లు ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు మాయమవుతాయి.. అంతే కాదు.. వాపు సమస్య తగ్గిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారు ఈ పూతను ప్రయత్నిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, ఒక అరటితొక్కను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి కాసేపాగి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంలో అధిక జిడ్డు వదులుతుంది. పాదాల పగుళ్ల నివారణకూ అరటి తొక్క ఉపయోగపడుతుంది.

అరటిపండు తొక్క ముద్దలో కాస్తంత కొబ్బరినూనె కలిపి ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేసే ముందు.. గోరువెచ్చటి నీటిలో పాదాలను కాసేపు ఉంచి ప్యూమిస్ రాయితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మృతకణాలు పోతాయి. ఆ తరువాత మిశ్రమం పట్టిస్తే మంచి ఫలితాలు ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version