మెడికో ప్రీతి మృతిపై మావోయిస్టుల స్పందించారు. ఆమె మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా డివిజన్ కార్యదర్శి వెంకట్ పేరిట లేఖను విడుదల చేశారు.
ర్యాగింగ్ వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకున్న, అధికారులు దాన్ని కప్పిపుచ్చడంతో పాటు సైఫ్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాలేజీలో ర్యాగింగ్ నిత్యకృత్యమైందని పేర్కొన్నారు. కాగా, జనగాం జిల్లా కోడకండ్ల మండలం గిర్నితండా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మెడికో ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి.
డాక్టర్ ప్రీతిని చివరిసారిగా చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిసాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.