యాంకర్ కావ్యశ్రీ, ఆమె తండ్రిపై మార్గాని భరత్ అనుచరుడి దాడి.. వీడియో వైరల్!

-

ఏపీలో అధికారానికి దూరం అయ్యాక వైసీసీ నేతలు, వారి అనుచరులు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్నారు. తాజాగా రాజమండ్రి వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ అనుచరుడు శ్రీనివాస్ తెలుగు యాంకర్ కావ్య శ్రీ, అతని తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. 2021లో తన వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదని కావ్య శ్రీ తండ్రి తెలిపారు.

నాటి నుంచి డబ్బులు ఇవ్వాలని అడిగినప్పుడల్లా ఇవాళా రేపు అంటూ మాట మారుస్తున్నాడని కావ్యశ్రీ ఆరోపించింది. పదే పదే కాల్స్ చేయగా డబ్బులు ఇస్తానని రమ్మని పిలిచి తనపై, తన తండ్రిపై దాడి చేసినట్లు ఆమె వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియో విజువల్స్ కూడా చూపించింది. ఈ మేరకు రాజమండ్రిలోని ప్రకాశ్ నగర్ పీఎస్‌లో వైసీసీ నేత, మాజీ ఎంపీ భరత్ అనుచరుడు శ్రీనివాస్ మీద వారు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version