తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా దసరా పండుగ హవా కనిపిస్తోంది. దీంతో చాలామంది మందుబాబులు.. విపరీతంగా… మద్యం కొనుగోలు చేశారు. ముఖ్యంగా చాలామంది బీర్లు తాగేందుకు ఆసక్తి చూపించిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీర్లలో… నాణ్యత లోపించిందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది.
చాలాసార్లు ఆ బీర్లు ఏదో కలిపారని… కొంతమంది వాదించారు. అయితే ఇలాంటి నేపథ్యంలో కింగ్ఫిషర్ బీర్ల గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. కింగ్ ఫిషర్ బీరులో నలకలు ఉన్నాయంటూ.. మందుబాబులు తాజాగా ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్ షాప్ దగ్గర కొనుగోలు చేసిన బీరులో చెత్త రావడంతో షాపు యాజమాన్యాన్ని నిలదీశారు మందుబాబులు. ఈ వీడియో వైరల్ గా మారింది.
కింగ్ ఫిషర్ బీరులో నలకలు.. మందుబాబుల ఆందోళన
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్ షాప్ దగ్గర కొనుగోలు చేసిన బీరులో చెత్త రావడంతో షాపు యాజమాన్యాన్ని నిలదీసిన మందుబాబులు. pic.twitter.com/nuXCP3Bc5i
— Telugu Scribe (@TeluguScribe) October 14, 2024