వైరల్‌ : లోకేష్ పాదయాత్రను అడ్డకోవాలంటూ మెసేజ్‌లు

-

గత కొన్ని రోజులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ నారా లోకేష్‌ యువగళం పేరిట పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా పాదయాత్రను అడ్డుకోండి, దాడులకు సిద్దం కావాలి అంటూ కార్యకర్తలను రెచ్చగొడుతూ వైసీపీ నేతలు మెసేజ్‌లు పంపుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం వైసీపీ నేత, ఎంపీపీ కోదండ రెడ్డి పేరుపై సోషల్ మీడియాలో మెసేజ్ ట్రోల్ అవుతోంది. ‘‘యువ గళం పేరుతో కుప్పంలో పాదయాత్ర చేసే అర్హత నారా లోకేష్‌కు లేదు.

 

టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో నిరుద్యోగ యువతకు భృతి కల్పిస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకోని లోకేషన్. 14 ఏళ్ళు సీఎంగా, 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాధాన్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు కుప్పానికి ఏం చేశాడో చెప్పాలి. మెడికల్, ఇంజనీరింగ్ అనేక విద్యాసంస్థలను బినామీ పేర్లతో చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు. కోట్లకు కోట్లు దండుకొని కుప్పంలో అడుగు పెట్టకుండానే గెలవాలని ప్రయత్నం చంద్రబాబు చేశాడు. ఇలాంటి చంద్రబాబు, నారా లోకేష్ పాదయాత్రను కుప్పం ప్రజలారా అడ్డుకోవడానికి సిద్ధం కావాలి’’ అంటూ మెసేజ్‌ల్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version