తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక కేరళకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ కలచివేస్తోంది. దీనిపై తాజాగా ఐడీ ప్రెష్ పుడ్ గ్లోబల్ సీఈవో పీసీ ముస్తఫా సోషల్ మీడియాలో వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ లో ర్యాగింగ్ కారణంగా తన మేనల్లుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు భావోద్వేగభరితంగా పోస్ట్ చేశారు.
“అతను నా మేనల్లుడు. నా కుమారుడికి బెస్ట్ ఫ్రెండ్. వయస్సు పదిహేనేళ్లు. నాకు బిడ్డతో సమానమైన అతను. ఇప్పుడు ఈ లోకంలో లేడు. కిండర్ గార్టెన్ చదువుతున్న రోజుల్లో బెంగళూరులో కొద్ది రోజులు మాతో ఉన్నాడు. అతను చనిపోయిన తరువాత కొద్ది కొన్ని కలత పెట్టే దృశ్యాలు మాకు అందాయి. తోటి విద్యార్థుల్లో కొంత మంది అతడినీ దూషించారు. కొట్టారు.. దారుణంగా వ్యవహరించారు. చర్మం రంగు గురించి ఎగతాళి చేశారు. స్కూల్ లోనూ, స్కూల్ బస్సులోనూ వేధించారు. చివరికీ చనిపోయే ముందు కూడా ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నాడు. అతని మరణాన్ని వేడుకగా భావించారని కొన్ని స్క్రీన్ షాట్లను చూస్తే తెలిసింది” అని ముస్తఫా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.