రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా అవినీతి చోటుచేసుకోవడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ శాఖలో జరగుతోన్న అవినీతిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయని వివరించారు.ఇప్పటికైనా అధికారులు తమ తీరును మార్చుకోకపోతే అవినీతి నిరోధక శాఖకు వివరాలు పంపిస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెండైతే, మళ్లీ ఉద్యోగంలో చేరతామని అనుకోవద్దని మరల విధుల్లోకి రాకుండా చేస్తామని తేల్చి చెప్పారు. మీరు తిన్న అవినీతి సొమ్మును పూర్తిగా రికవరీ చేయిస్తానని హెచ్చరించారు. ఇక నుంచి ప్రతినెలా విజిలెన్స్ నివేదికల ఆధారంగా అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టంచేశారు.