శబరిలో అయ్యప్ప స్వాముల బస్సుకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో..కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేరళలో హైదరాబాద్ కు చెందిన అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్…. డ్రైవర్ మృతదేహాన్ని ఉచితంగా హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నారు.
అలాగే.. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల వైద్య చికిత్సకు సహాయం అందించారు బండి సంజయ్. కాగా, శబరిమలకు వెళ్లిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ పాత బస్తీ మదన్నపేట ఉప్పర్ గూడాకు చెందిన స్వాములు ప్రయాణిస్తున్న బస్సు పంపా నదికి 15 కి.మీ దూరంలోని ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు మృతి చెందగా.. 22 మంది అయ్యప్పస్వాములకు గాయాలు అయ్యాయి. కొట్టాయం నుంచి శబరిమల వెళ్తుండగా కనమల అట్టివలం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
కేరళలో హైదరాబాద్ కు చెందిన అయ్యప్పస్వాముల బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
డ్రైవర్ మృతదేహాన్ని ఉచితంగా హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు
అలాగే.. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల వైద్య చికిత్సకు సహాయం అందించిన బండి సంజయ్ https://t.co/b5ihoOzfUp pic.twitter.com/MQu4AXH9rJ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2025