బడ్జెట్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని, అందుకు నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ ధర్నాను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం నిర్వహించే నిరసనలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలని మంత్రి సూచించారు.
ఈ మేరకు ఆదివారం మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే కాంగ్రెస్ ధర్నాలో హైదరాబాద్ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, పార్టీ అనుబంధ సంఘాలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.