కర్ణాటకలో ఆ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు భారీ ధర్నా చేపట్టారు. దీంతో జాతీయ రైతు సంఘం నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలుకు డిమాండ్ చేశారు. ఈరోజు బెంగళూరులో కర్ణాటక రైతుల న్యాయమైన సమస్యల పరిష్కారము కొరకై రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది రైతులు అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చారు. స్థానిక మెజిస్టిక్ రైల్వే స్టేషన్ నుండి అసెంబ్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు.
కర్ణాటక రైతులకు సంఘీభావం తెలిపారు దక్షిణ భారత రైతు సమాఖ్య నాయకులు కోటపాటి నరసింహం నాయుడు, నల్లమల్ల వెంకటేశ్వరరావు ,P.K దైవసిగామని , కే యం రామ గౌoడర్ , కె శాంత కుమార్ ఏఎస్ బాబులతో పాటు ఉత్తమ భారతదేశం నుండి శివకుమార్ కక్కాజి , దల్లే వాల్ లు కర్ణాటక రైతులకు మద్దతు తెలపడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల రైతులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లకు తరలించారు. రైతుల డిమాండ్లు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. చెరుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ ఉత్పత్తులు మరియు యంత్ర పరికరాలపై GST రద్దు చేయాలన్నారు.