భారీగా తగ్గిన పసిడి ధర..!

-

భారతదేశ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు వస్తున్నాయి. రోజూ ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు దేశీయంగా బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.470 తగ్గుముఖం పట్టింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950కి చేరింది. చెన్నై నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,170గా ఉంది.

బంగారం

బెంగళూరు పట్టణంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,600 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,800గా ఉంది. కోల్‌కతా నగరంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300గా ఉంది. అలాగే హైదరాబాద్ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,800కి తగ్గింది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,600 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,800గా ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశమన్నారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తత, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాల ప్రభావం వల్ల పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version