మస్తాన్‌ సాయి కేసులో బయటపడుతున్న నిజాలు..!

-

మస్తాన్‌ సాయి కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్‌ చేసిన మస్తాన్‌ సాయి.. తన దగ్గరకు వచ్చిన అమ్మాయిలకు మత్తుమందు ఇచ్చి.. డ్రగ్స్‌ అలవాటు చేసి అమ్మాయిల నగ్నచిత్రాలను చిత్రీకరించాడు. ఆయా తర్వాత అమ్మాయిల న్యూడ్‌ వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు మస్తాన్‌ సాయి. అయితే తాజాగా ఆధారాలతో సహా మస్తాన్‌ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య.

అయితే మస్తాన్ సాయిని నార్సంగి పోలీస్ స్టేషన్ నుండి తరలించిన పోలీసులు.. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు పై మస్తాన్ సాయి పై కేసు నమోదు చేసారు. న్యాయమూర్తి ఇంట్లో హాజరు పరిచేందుకు మస్తాన్ సాయిని తీసుకొని వెళ్లారు నార్సింగ్ పోలీసులు. అయితే ఆ వీడియోలో ఉన్నది నా భార్య, నా గర్ల్ ఫ్రెండ్.. అనవసరంగా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మస్తాన్ సాయి అన్నాడు. 2017 లో హనీమూన్ కు వెళ్ళినప్పుడు తీసుకున్నవి. ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్ లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయి. వాటిని మాయం చేసేందుకు లావణ్య హార్డ్ డిస్క్ ను దొంగిలించింది అని పేర్కొన్నాడు మస్తాన్ సాయి.

Read more RELATED
Recommended to you

Latest news