దేవుడా.. మొసలితో పెళ్లి.. ముద్దులు.. ఆపై..

-

ఎవ్వడి పిచ్చి వాడికి ఆనందం.. కొందరికి పిచ్చి ముదురి ఏవేవో చేస్తారు..మరి కొంతమంది వాళ్ళ పిచ్చి గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు..పిచ్చి ఎక్కువై కొందరు వింత వివాహాలు చేసుకోవడం మనం చూసే ఉంటాము..చెట్టును వివాహం చేసుకోవడం చూశాం కానీ.. క్రూర జంతువులను పెళ్లి చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు.. ఎక్కడా వినలేదు..

విషయాన్నికొస్తే… ఓ మేయర్ క్రూర జంతువు అయిన మొసలిని పెళ్ళి చేసుకున్నాడు.అది కూడా సంప్రదాయ పద్ధతుల్లో. ఇంతకు ఎక్కడ అనుకుంటున్నారా.. ఇది జరిగింది మెక్సికోలో. ఓక్సాకా అనే మత్స్యకార గ్రామానికి చెందిన విక్టర్‌ హ్యుగో సోసా.. ఏడేళ్ల మొసలిని గత గురువారం పాత సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కుమార్తె అయిన మొసలిని తెల్లని వస్త్రాలు ధరించి.. అందంగా ముస్తాబు చేశారు.

ఈ వివాహ వేడుకల్లో భాగంగా ఆ మొసలిని ఆ మేయర్‌ ముద్దాడటం అందరినీ ఆకట్టుకుంది..ఈ పెళ్లికి బంధువులు, స్నేహితులు అందరూ తరలివచ్చారు. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో ఆటలు, పాటలతో వచ్చిన వారంతా ఎంజాయ్ చేశారు. ఈ వివాహానికి సంభందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..ఈ వీడియో పై మీరు ఓ లుక్ వేసుకొండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version