ఈటల జమున భుముల వ్యవహారం లో మెదక్ కలెక్టర్ చేసిన ఆరోపణల పై ఆమె స్పందించారు. తాము 70 ఎకరాలు ఆక్రమించామని మెదక్ జిల్లా కలెక్టర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఈటల జమున తేల్చి చెప్పారు. ఈ ఆరోపణలు చేసిన కలెక్టర్ హరీష్ పై కేసులు పెడతామని ఈటల జమున ప్రకటించారు. అసలు ఈ భుముల కేసు కోర్ట పరిధి లో ఉందని అన్నారు. అలాగే ఈ వ్యవహారం లో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ ఎలా పెడుతారని ప్రశ్నించారు.
ప్రెస్ మీట్ పెట్టడానికి హరీష్ కలెక్టరా ? లేదా టీఆర్ఎస్ కార్యకర్త నా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్లర్క్ గా పని చేస్తుంన్నాడని ఆరోపించారు. నిజానికి ఈ భుమల విషయం లో ఎలాంటి సమస్యలు లేవని ప్రభుత్వ వెబ్ సైట్ ధరణి లో రికార్డు అయి ఉందని గుర్తు చేశారు. తమ భుమలన్నీ కూడా లీగల్ గా రికార్డు అయి ఉన్నాయని స్పష్టం చేశారు. అసలు 2019 లో తాము భూములను కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడు రానీ ఈ వ్యవహారం ఇప్పుడే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. రాజకీయం ఒంటరి చేయడానికి టీఆర్ఎస్ నాయకులు ఆడుతున్న నాటకమని అన్నారు.