గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 901 మందికి పోలీసు పతకాలు అందజేయనుంది. 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ), 93 మంది పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎం), 668 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది.
ఈ అవార్డుల్లో ఆంధప్రదేశ్ నుంచి 17, తెలంగాణ నుంచి 15 మందికి పోలీసు పతకాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకం (పీపీఎం), 15 మందికి విశిష్ట సేవా పతకాలు ప్రకటించారు. తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకం (పీపీఎం), 13 మందికి పోలీస్ విశిష్ట సేవాల పతకాలు (పీఎం) ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి అదనపు డీజీ అతుల్ సింగ్, 6వ బెటాలియన్ రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సంగం వెంకటరావు, తెలంగాణ నుంచి అదనపు డీజీ అనిల్ కుమార్, 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ బృంగి రామకృష్ణ రాష్ట్రపతి పతకాలు అందుకోనున్నారు.