క‌రోనా ఎఫెక్ట్‌: కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిద్దామా?

-

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్లీ మ‌ళ్లీ విజృంభిస్తోంది. అంతా త‌గ్గిపోయింద‌ని అనుకున్న చైనాలోనే మ‌ళ్లీ కొత్త కేసులు వ‌స్తున్నాయి. మ‌న ద‌గ్గర కూడా ఏమీలేద‌ని చెప్పుకొన్న కేర‌ళ వంటి రాష్ట్రాల్లోనూ ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తోంది. దీంతో లాక్‌డౌన్ విష‌యంలో ప్ర‌భుత్వాలు మ‌రింత క‌ఠినంగా ముందుకు సాగుతున్నాయి. ప్ర‌స్తుతానికి అయితే, మందు లేని వ్యాధిగా ప్ర‌జ‌ల‌ను క‌బ‌ళిస్తున్న క‌రోనా విష‌యంలో లాక్‌డౌన్‌ను మించిన ఔష‌ధం లేద‌నేది అంద‌రికీ తెలిసిందే. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమిత‌మవుతున్నారు. అయితే, ఈ ఇళ్ల‌లో ఉన్నా.. క‌రోనా మ‌హ‌మ్మారి త‌మ‌కు ఎక్క‌డ ఏ రూపంలో ఎలా చుట్టుకుంటుందోన‌ని హ‌డ‌లిపోతున్న వారు కూడా క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంట్లోనే ఉంటూ..  మ‌న చేతుల్లోను, చేత‌ల్లోను ఉన్న మేర‌కు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. కొంత వ‌ర‌కు క‌రోనాను క‌ట్ట‌డి చేయొచ్చ‌ని చెబుతున్నారు వైద్యులు. ఈ నేప‌థ్యంలో వాటిని ఏంటో చూద్దాం.

ప్రాథ‌మిక ద‌శ‌లో జాగ్ర‌త్త‌లు.. ఇవీ..!

నీటిలో మరిగించిన చేతి రుమాలును పిండి ఆరేసిన త‌ర్వాతే ముక్కుకు, నోటికి కట్టుకోవాలి. డబ్బాలో కర్పూరం, పేపరు రుమాళ్లను 4 అంగుళాల ముక్కలు గా కత్తిరించి ఉంచి, బయటకు వెళ్లినప్పుడు అలా కర్పూరంలో ఉంచిన కాగితం రుమాళ్లను  ముఖానికి తగిలించిన మాస్కు లేదా చేతి రుమాలు మడతల్లో ఉంచుకోవడం శ్రేయస్కరం. కర్పూరం వైరస్‌ని దరిచేరనీయదు. నోటి ద్వారా కరోనా వైరస్‌ మీపై దాడి చేయకుండా తరుచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం ఒక్కటే మార్గం. ప్రభుత్వం సూచిస్తున్నవిధంగా ఇళ్ళకే పరిమితం కావాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version