ఏం కావాలన్నా సిగ్గు పడకుండా… అడగమన్నాడు…!

-

లాక్ డౌన్ లో ప్రేక్షకులను ఎదోకరకంగా వినోద పరచాలని క్రికెటర్లు, సినిమా వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. సోషల్ మీడియాలో తమకు సంబంధించిన విషయాలను వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మరో బెంగాల్ వెటరన్ ఆటగాడు మనోజ్ తివారీతో సోషల్ మీడియాలో సరదాగా ముచ్చటించాడు. షమీ తన కెరీర్ ప్రారంభ దశలో అతనికి సహాయం చేసిన ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల పేర్లను కూడా వెల్లడించాడు.

ఐపిఎల్ ఫ్రాంచైజ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో ఉన్న సమయంలో, అతను మొదట తన సీనియారిటీ కారణంగా పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్‌తో మాట్లాడటంలో ఇబ్బందులు పడ్డా అని చెప్పాడు. ఆ తర్వాత అతను స్వయంగా తనకు సహాయం చేసాడని చెప్పాడు. “నేను కెకెఆర్ కు వచ్చినప్పుడు, క్రికెట్ సంబంధించిన నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేశా అని చెప్పాడు. వసీం అక్రమ్‌ను అప్పటి వరకు టీవీ లో మాత్రమే చూసా అన్నాడు.

కాని కేకేఆర్ తో ఆడిన తర్వాత నేర్చుకునే అవకాశం వచ్చిందని చెప్పాడు. తాను మాట్లాడటానికి ఇబ్బంది పడిన సమయంలో వసీం తన వద్దకు వచ్చాడని తానే స్వయంగా మాట్లాడటం, బౌలింగ్ గురించి చెప్పడం మొదలు పెట్టాడని అన్నాడు. తనను అతను బాగా చదివేశాడు అని చెప్పడం గమనార్హం. ఏం కావాలన్నా సిగ్గు పడకుండా తనను వచ్చి అడగాలని వసీం చెప్పినట్టు గుర్తు చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version