కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే అందరికీ ఇది నిజమైన శుభవార్త ఈ కరోనా మందు తో. కరోనా చికిత్సలో వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మరో ఔషధాన్ని అనుమతిచ్చింది. అయితే చర్మ వ్యాధి అయిన సొరియాసిస్ ని నయం చేయడానికి ఉపయోగించే ఇటోలీజ్యుమ్యాజ్ ను పరిమితం చేసిన అత్యవసర వినియోగం కింద వాడేందుకు అంగీకరించింది. అయితే తీవ్ర స్థాయి లక్షణాల్లో బాధ పడుతున్న రోగులకు దీన్ని ఇవ్వొచ్చని తెలిపింది.
డి సి జి ఐ డాక్టర్ విజయ్ సొమాని కరోనా చికిత్సలో ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకుని
ఇటోలీజ్యుమ్యాజ్ ని అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మందును భారత్ కి చెందిన బయోకాన్ సంస్థ తయారు చేస్తోంది. అయితే కోవిడ్ పై పోరాడే యాంటీ బాడీస్ ఉత్పత్తి లో కీలకంగా పనిచేసిన సైటోకిన్ల విడుదల లో సమర్థంగా పని చేస్తున్నట్లు గుర్తించారు.
ఇదిలా ఉంటే రోగులు పని చేసిన ప్రయోగాలు సంతృప్తికరమైన ఫలితాలు వస్తేనే దీనిని ఉపయోగించడానికి అవుతుందని చెప్పారు అయితే ఎయిమ్స్ కు చెందిన పలువురు వైద్యనిపుణులు ఈ పరీక్ష పర్యవేక్షించినటు గడించారు. ఈ మందును సోరియాసిస్కు అనేక సంవత్సరాల నుంచి కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు దీని తీసుకోవాల్సిన బాధితులు రాత పూర్వకంగా అంగీకరించాల్సి ఉంటుందని చెప్పారు
ఇతర రోగులకు దీన్ని అందించగా వెంటనే వెంటిలేటర్ దశ నుంచి సాధారణ స్థితికి చేరుకున్నట్లు చెప్పారు ఆసుపత్రి లో ప్రయోగ పూర్వకంగా వాడేందుకు ఈ మందుని ఉచితంగా ఇస్తామని ఈ సంస్థ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ప్రకటించారు. ఇప్పటికే కరోనా సోకకుండా ఉండేందుకు పలు వాటిని మందులుగా వేసుకున్నట్లు కూడా తెలిసినదే.