ప్రపంచాన్నే గడగడలాదిస్తున్న కరోనా మన దేశాన్ని కూడా పీల్చిపిప్పి చేసింది. ఇప్పటికే ఎన్నో ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కరోనాని అరికట్టేందుకు శాస్త్రవేత్తలంతా పగలు-రాత్రులు అనే తేడా తెలియకుండా కష్టపడుతున్నారు. ఇక ఈ ప్రమాధకార మహమ్మారిని అరికట్టాలనే అంశాన్ని ఛాలెంజ్ గా తీసుకున్న శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఓ ఔషదాన్ని తయారు చేశారు.
ఈ ప్రాణాంతక వైరస్ ను అరికట్టేందుకు గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ సంస్థ ఔషదాన్ని తయారు చేసిందనే ప్రకటన తెలిసిందే. ఇక ఆ ఔషదాన్ని విక్రయించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) హెటిరో సిప్లా కంపెనీలకు అనుమతి పత్రాలను మంజూరు చేసింది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ధరతో కోవిఫర్ 100 ఎంజీ అనే పేరుతో ఈ ఔషధం మార్కెట్ లోకి అందుబాటులోకి రానుంది. ఈ డ్రగ్ ఇంజెక్షన్ రూపంలో రాబోయే రెండు వారాల్లో పూర్తిస్థాయిగా అందుబాటులోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. హెటిరో సంస్థ హైదరబాద్ కు చెందిన సంస్థ అయినందున కరోనా యాంటీ డ్రగ్ ను కనిబెట్టిన ఘనత హైదరబాద్ కు దక్కడం గమనార్హం..!