మంత్రి దామోదర రాజనర్సింహ తో ప్రత్యెక భేటీ అయిన ఇన్చార్జి మీనాక్షి నటరాజన్.. పటాన్ చేరువులో ఏం జరుగుతుంది అని వివరణ అడిగారు. పార్టీ నాయకులను కాపాడుకోవాలి కదా అన్నారు. అయితే అందరికీ న్యాయం చేస్తా. కొత్త వారికి కలుపుకుని పోతాం. పార్టీ అంతర్గత విషయాలు..మీటింగ్ లోనే చెప్పండి. గాంధీ భవన్ బయట మాట్లాడొద్దు. మంత్రులు తప్పొప్పులు కూడా మీటింగ్ లోనే చెప్పండి. మీటింగులు పెట్టండి.. సోషల్ మీడియ లో పెట్టడం వద్దు.
ఇక పార్టీ క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవు. సిద్దిపేట మీద ప్రత్యేక ఫోకస్ పెడతా అని సిద్దిపేట వ్యవహారాలు మంత్రి దామోదర రాజనర్సింహకు చెప్పారు ఆమె. అలాగే రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల ముందు మనం ఎంత అని అన్నారు. కాబట్టి వాళ్ళ త్యాగాలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ కోసం కూడా కష్టపడాలి అని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు.