కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ, రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించారు.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగులపై అనేక వరాల జల్లులు కురిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక తమను విస్మరించారని ఓయూలో చదువుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మెగా DSC, రూ.4వేల నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీ ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోస్టు కార్డ్ రాసి విద్యార్థినులు నిరసన తెలిపారు.