“వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి” పెళ్లి పనులు మొదలయ్యాయోచ్ !

-

టాలీవుడ్ లో హీరో హీరోయిన్ లుగా ప్రేక్షకులకు పరిచయం అయిన ఇద్దరు నటీనటులు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు అందాల బొమ్మ లావణ్య త్రిపాఠి లు తాము నటించిన సినిమాలలో పరిచయం మరింత పెంచుకుని ఇప్పుడు పెళ్లి పీటల వరకు చేరుకున్నారు. ఈ మధ్యనే వీరి నిశ్చితార్థం పూర్తి కాగా పెళ్లి త్వరలోనే జరగనుంది. ఇక మెగా వారింట పెళ్లి పనులు కూడా మొదలైనట్లుగా సమాచారం అందుతోంది. ఇక లేటెస్ట్ గా మీడియా అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిలు ముందుగా బట్టలు కొనుక్కుని పెళ్లి పనులను మొదలు పెట్టాలను ఆలోచించినట్లు తెలుస్తోంది. కాగా ఇద్దరూ కలిసి ప్రముఖ ఫాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా బోటిక్ కు వెళ్లారట.. ఈ పెళ్లి కోసం మనీష్ ప్రత్యేకంగా బట్టలు డిజైన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ వార్త మెగా ఫ్యాన్స్ ను మరింతగా ఆతృతను లోను చేస్తోంది. ఇంకా పెళ్ళి తేదీలను ఇంకా ప్రకటించలేదు… నిశ్చితార్థం లాగా పెళ్లిని కూడా చాలా సైలెంట్ గా కనిస్తారా అంటూ ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version