చిరు ప్ర‌శంస : నాని సినిమా బాగుంది కానీ..!

-

ఇవాళ థియేట‌ర్ లో సినిమాను న‌డిపించ‌డం ఓ క‌త్తి మీద సాము. అలాంటిది నాని ప‌ట్టుబ‌ట్టి నిర్మాత‌ను ఒప్పించి,త‌న డ‌బ్బులు కూడా కొంత పెట్టుబ‌డిగా ఉంచి సినిమాపై న‌మ్మ‌కంతో శ్యామ్ సింగ రాయ్ ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశాడు. కానీ ఆ సినిమా రిజ‌ల్ట్ తేడా కొట్టింది. యావ‌రేజ్ టాక్ తెచ్చుకుని వెళ్లి పోయింది.

ఇలాంటి నిరాశ పూర్వ‌క స‌మ‌యంలో నాని న‌టించిన శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని ఇవాళ చిరంజీవి చూశారు. సినిమా అద్భుతంగా ఉంద‌ని ప్ర‌శంసించారు. ముఖ్యంగా నాని న‌ట‌న త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని తెలిపారు. ఇక రేప‌టి వేళ నెట్ ఫ్లిక్స్ ద్వారా శ్యామ్ సింగ‌రాయ్ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంది.

ఈ నేప‌థ్యంలో చిరు ప్ర‌శంస త‌న‌నెంతో ఉత్సాహ‌ప‌రించింద‌ని హీరో నాని అన్నారు. వాస్త‌వానికి ఈ సినిమా విష‌య‌మై మొద‌ట్నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర‌య్యాయి నానికి. ఆఖ‌రికి రెమ్యున‌రేష‌న్ మొత్తంలో ఐదు కోట్ల రూపాయ‌ల ను కూడా వ‌దులుకుని సినిమా విడుద‌ల‌కు స‌హ‌క‌రించారు. అయిన‌ప్ప‌టికీ ఆంధ్రాలో అమ‌ల‌వుతున్న టికెట్ ధ‌ర‌ల దృష్ట్యా చాలా చోట్ల నిర్మాత‌కు న‌ష్టాలే మిగిలాయి. సినిమా విడుద‌ల ముందు నాని చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు కోపం తెప్పించాయి.

ప్ర‌స్తుత కాలంలో ఏపీలో థియేట‌ర్ వ‌సూళ్ల క‌న్నా ప‌క్క‌నే ఉన్న పాన్ డ‌బ్బా వాలా క‌లెక్ష‌న్ ఎంతో బెట‌ర్ అని వ్యాఖ్యానించి సంచ‌ల‌నం అయ్యాడు. దీంతో మంత్రులు అంతా అల‌ర్ట్ అయి నానిని టార్గెట్ చేయ‌డం, శ్యామ్ సింగ‌రాయ్ విడుద‌ల చేసేందుకు సిద్ధం అవుతున్న థియేట‌ర్ల‌పై దాడులు చేయించి మూసి వేయించ‌డం వంటి ప‌నులెన్నో చేశారు.

దీంతో సినిమాకు అస్స‌లు రావాల్సిన క‌నీస స్థాయి వ‌సూళ్లు కూడా రాకుండా పోయాయి.ఇదే స‌మ‌యంలో ఓవ‌ర్సీస్ లోనూ అంత‌గా క‌లెక్ష‌న్లు ద‌క్కించుకోలేక‌పోయింది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ సినిమా ఆశించిన విధంగా న‌డ‌వ‌లేదు.. ఆశించిన విధంగా వ‌సూళ్లు సాధించ‌లేదు.

కానీ ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈ త‌రుణాన చిరు నుంచి వ‌చ్చిన ప్ర‌శంస నిజంగానే నానికి మ‌రియు చిత్ర బృందానికి ఓ ఎన‌ర్జీ బూస్ట‌రే!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version