15-18 వ్యాక్సిన్ : దేశంలో అగ్ర‌స్థానంలో ఏపీ

-

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది జ‌న‌వ‌రి 3 వ తేదీ నుంచి 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌కు క‌రోనా నియంత్ర‌ణకు వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న పిల్ల‌లు టీకా తీసుకున్న వారి సంఖ్య 50 శాతానికి చేరుకుంది. తాజా గా నేటికి 52 శాతం మంది పిల్ల‌లు మొద‌టి డోసు తీసుకున్నార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల పిల్ల‌లు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆంధ్ర ప్ర‌దేశ్ 91 శాతంతో అగ్ర స్థానంలో ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

అలాగే 83 శాతం తో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రెండో స్థానంలో ఉంద‌ని తెలిపారు. అలాగే మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రం 71 శాతం మందితో మూడో స్థానంలో ఉంది. కాగ తెలంగాణ రాష్ట్ర మాత్రం చిట్ట చివ‌రిలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారు కేవ‌లం 55 శాతం మందే వ్యాక్సిన్లు తీసుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో 19 వ స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version