టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన ఫిల్మ్ ‘ఆచార్య’. ఈ నెల 29న పిక్చర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ డైరెక్టర్ కొరటాల శివ, హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ మంగళవారం మీడియాతో మచ్చటించారు. ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది. సిద్ధ పాత్రలో పవన్ కల్యాణ్ ఉంటే ఎలా ఉంటుంది? భవిష్యత్తులో రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమా చేయొచ్చా? అని ఓ ప్రతినిధి క్వశ్చన్ అడిగారు. దానికి చిరంజీవి ఆసక్తికర సమాధానమిచ్చారు.
ఈ ‘ఆచార్య’ సినిమాలో స్టోరి పరంగా హీరోలు అందరూ న్యాయం చేస్తారని, అయితే, ఈ పాత్రకు యాప్ట్ పర్సన్ రామ్ చరణ్ అని చెప్పారు. చరణ్ ఉంటే ఫీల్ బాగుంటుందని, పైగా తండ్రీ కొడుకుల అనుబంధం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని స్పష్టం చేశారు.
ఒకవేళ రామ్ చరణ్ దొరకకపోతే..ద బెస్ట్ ఆల్టర్నేటివ్.. సబ్‌స్టిట్యూల్ ఆల్టర్నేట్ పవన్ కల్యాణ్ అని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. అయితే, అంత వరకు రామ్ చరణ్ చాన్స్ ఇవ్వలేదన్నారు. అయితే, ‘సిద్ధ’ పాత్రలో పవన్ కల్యాణ్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేవాడని చెప్పుకొచ్చాడు ‘ఆచార్య’.