గతంలో నేను క్యాన్సర్‌ బారిన పడ్డాను.. చిరంజీవి షాకింగ్‌ కామెంట్స్‌

-

టాలీవుడ్‌ అగ్రనాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. గతంలో ఆయన క్యాన్సర్‌ బారిన పడినట్లు వెల్లడించారు. అయితే.. ముందుగా గుర్తించి చికిత్స తీసుకుని బయటపడ్డానని ఆయన పేర్కొన్నారు. క్యాన్సర్‌ వచ్చిందని చెప్పడానికి భయపడలేదని మెగాస్టార్‌ వెల్లడించారు. ముందుగా గుర్తిస్తే క్యాన్సర్‌ పెద్ద జబ్బు కాదని చిరంజీవి వ్యాఖ్యానించారు.. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడాలోని స్టార్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగాన్ని చిరంజీవి శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను క్యాన్సర్ బారినపడిన విషయాన్ని రివీల్ చేశారు.

ఇదిలా ఉంటే ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సినీ రంగ ప్రముఖులు స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒడిశాలో విషాదకరమైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిందని పేర్కొన్న చిరంజీవి భారీ ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రాణాలను కాపాడేందుకు రక్తం ఎంతో అవసరంగా మారిందని, క్షతగాత్రులకు రక్త యూనిట్ల కోసం అవసరం ఉందని తాను అర్థం చేసుకున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ప్రాణాలను రక్షించే రక్త యూనిట్లను దానం చేయడం కోసం సాధ్యమైన సహాయాన్ని అందించమని మా అభిమానులందరికీ, మరియు సమీప ప్రాంతాల్లోని మంచి స్వచ్ఛంద సేవకులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version