ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉన్నాం : చిరంజీవి

-

మెగా ఫ్యామిలీ లో ఎన్నో ఏళ్ళు తపస్సు ఫలించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దీంతో మెగా కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. చాలా సంవత్సరాలుగా రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు పిల్లలు లేకపోవడంతో అనేకచోట్ల ఈ ప్రశ్నను ఫేస్ చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాలోనూ ఉపాసన ను టార్గెట్ చేసి వారసులను ఇవ్వడంలేదని విమర్శించిన వారు లేకపోలేదు. కానీ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పిన ఉపాసన అది తన వ్యక్తిగత జీవితం అని, తాము ఏం చేయాలో తమకు తెలుసని అనేకమార్లు మీడియా ముఖంగా చెప్పారు.

మనవరాలు పుట్టటంపై మెగాస్టార్ చిరంజీవి మీడియా ముఖంగా స్పందించారు. ‘‘మంగళవారం ఉద‌యం 1 గంట 49 నిమిషాల‌కు రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌కు పాప పుట్టింది. ఇంటిల్లిపాది చాలా సంతోషంగా ఉన్నాం. ఈ పాప ఎంతో అపురూపం. ఎందుకంటే ఎన్నో సంవత్స‌రాల నుంచి వాళ్లు త‌ల్లిదండ్రులై బిడ్డ‌ల‌ను మా చేతిలో పెట్టాల‌ని అనుకుంటున్నాం. ఇన్నేళ్ల‌కు ఆ భ‌గ‌వంతుడి ద‌య వ‌ల‌న‌, అంద‌రి ఆశీస్సులు వ‌ల‌న ఆ కోరిక నేర‌వేరింది. ఇత‌ర దేశాలు, ఇత‌ర ప్రాంతాల నుంచి మా స్నేహితులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు, మా సంతోషాన్ని త‌మ సంతోషంగా భావించే అభిమానులు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. వారంద‌రికీ నా కుటుంబం త‌ర‌పున ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేసుకుంటున్నాను.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version