ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పబ్‌ వీడియో వైరల్‌

-

తాండూరు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హల్‌చల్ చేశారు. అమ్మాయిలతో కలిసి బీర్ బాటిల్స్‌తో చీర్స్ అంటూ..ఎంజాయ్ చేశారు ఎమ్మెల్యే. రోహిత్‌‌రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్‌లో రోహిత్‌రెడ్డి చేసిన హంగామా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ పాత్రికేయుడు తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాండూరు ప్రజల ఆశాజ్యోతి… గౌరవ శ్రీ పైలెట్ రోహిత్ రెడ్డి గారి లలిత కళలు అంటూ మల్లన్న వ్యంగ్యం ప్రదర్శించారు. కాగా, సోషల్ మీడియాలో పైలెట్ రోహిత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఓ బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇలా పబ్‌లో షాంపైన్‌‌తో ఎంజాయ్ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా సమస్యలను పక్కనపెట్టి పార్టీలకు, పబ్‌లకు తిరగడమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పబ్‌లో జరిగిన దాడిలో.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సోదరుడి వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version