ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో రికార్డు.. కాంస్యం సాధించిన భవానీ..

-

ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ ఫెన్సర్‌‌‌‌‌‌‌‌ భవానీ దేవి కొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ గెలిచింది. దాంతో, ఈ టోర్నీలో పతకం సాధించిన తొలి ఇండియన్ గా రికార్డుకెక్కింది. చైనాలోని వుజిలో సోమవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సాబ్రెలో సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరుకోవడం ద్వారా ఈ ఘతన సాధించింది. 29 ఏండ్ల భవానీ క్వార్టర్ ఫైనల్లో 15–-10తో వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ మిసాకి ఎమురా (జపాన్‌‌‌‌‌‌‌‌)ను ఓడించి ఆశ్చర్యపరిచింది. అయితే, హోరాహోరీగా సాగిన సెమీస్‌‌‌‌‌‌‌‌లో 14–15తో ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన జైనబ్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడిపోయింది.

మరోవైపు భవానీ దేవీ కాంస్యం పతకం సాధించంపై భారత ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి అభినందనలు తెలిపారు. భారత ఫెన్సింగ్‌కు ఇది గర్వపడే రోజు అని, గతంలో ఎవరూ సాధించలేనిది ప్రస్తుతం భవాని సాధించిందని భారత ఫెన్సింగ్ సంఘం కార్యదర్శి రాజీవ్ మెహతా పేర్కొన్నారు. ఈ ఛాంపియన్ షిప్స్‌లో మొదటి నుంచి కష్టపడి కఠిన సవాళ్లను ఎదుర్కొని కాంస్యం అందుకోవడం విశేషం. తొలి రౌండ్లో భవానికి భై లభించగా.. రెండో రౌండ్లో డోస్పే కరీనాపై ఆమె గెలుపొందింది. మరోవైపు ఫ్రీ క్వార్టర్స్ లో ఒజాకి సెరిని 15-11తో భవాని చిత్తు చేసింది. ఇక క్వార్టర్స్ లో అయితే ప్రపంచ ఛాంపియన్ షిప్ మిసాకి ఎమూరాను 15-10తో చిత్తు చేసి సత్తా చాటింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version