శృంగారం లో మగవాళ్ళు చేసే పొరపాట్లు.. మీరు కూడా చేస్తున్నారా?

-

పొరపాట్లు తెలుసుకుని సరైన పద్దతులను అలవాటుగా మార్చుకుంటే అంతకంటే మించినది ఏదీ ఉండదు. ముఖ్యంగా శృంగారం విషయంలో ఇది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే చాలామంది మగవాళ్ళు కలయికలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో తెలుసుకుందాం.

పొరపాటు 1: సెక్స్ పడకగదిలోనే మొదలు కావడం

స్విఛ్ వేయగానే బల్బు వెలిగినంత ఈజీగా మగవాళ్ళలో శృంగార కోరికలు కలుగుతాయి. అలాగే ఆడవాళ్ళలో జరుగుతుందనుకుంటే పొరపాటే, రోజువారి పనుల్లో కౌగిలింత, ముద్దూ ముచ్చట, ఏకాంత సేవా మొదలగునవి శృంగారానికి దారి తీస్తాయి. 30సెకన్ల పాటు కౌగిలించుకుంటే ఆక్సిటోసిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది శృంగార భావాన్ని శిఖరాగ్రానికి తీసుకువెళుతుంది.

పొరపాటు 2: వాళ్ళకేం కావాలో తెలుసు అనుకోవడం

శృంగారం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. ఎవరికి ఏ విధంగా బాగుంటుందనేది వాళ్ళనే అడిగి తెలుసుకోవాలి. ఆ విషయంలో ఓపెన్ గా ఉండడం చాలా మంచిది.

పొరపాటు 3: ఒకే ప్లాన్ లో వెళ్ళడం

రెండు మూడు సార్లు ఉపయోగించిన ప్లాన్ ప్రతీసారీ వర్కౌట్ అవుతుందని అనుకోవద్దని సెక్స్ థెరపిస్టులు చెబుతున్నారు. ఆ సమయంలో వారి మూడ్, నెలసరి మొదలగు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.

పొరపాటు 4: కేవలం శారీరక తృప్తి కోసమే చూడడం

శారీరకంగా తృప్తి ఎంత ముఖ్యమో మానసికంగానూ అంతే ముఖ్యం. అందుకని ఫోర్ ఫ్లే మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.

పొరపాటు 5: మోహించడాన్ని వదిలేయడం

ఇరువురికి మోహం ఉండాలి. ఒకరి పట్ల ఒకరు విడదీయలేనంత గాఢంగా ఉండాలి. అన్నీ మాట్లాడుకోవాలి. కొన్ని కొన్ని సార్లు బూతులు కూడా. ఎందుకంటే చాలా మందికి శృంగారంలో బూతులు మాట్లాడడం అలవాటుగా ఉంటుంది. అవతలి వారు ఓపెన్ గా మాట్లాడుకునేలా ప్రేరేపించేలా మీరే చెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version