ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ యూజర్లకు షాక్.. ఇక నుంచి పే చేస్తేనే బ్లూ టిక్‌!

-

ట్విటర్ బాటలో మెటా పయనిస్తోందా అంటే తాజా నిర్ణయాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ట్విటర్ మాదిరి మెటా కూడా ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ ఖాతాదారులకు ఓ షాక్ ఇవ్వబోతోంది. బ్లూ టిక్ వెరిఫికేషన్ జనరల్ యూజర్లు ఇక నుంచి బ్లూ టిక్ సర్టిఫికేషన్ వినియోగించుకోవాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందట.

ఇంతకుముందు మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా ప్రభావ శీలురు, ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలకు మాత్రమే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఈ బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ ఇచ్చేవి. కానీ ఇప్పుడు నిబంధన సడలించింది మెటా. సాధారణ వ్యక్తులెవరైనా నెలవారీ ఫీజు పే చేసి బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ పొందవచ్చునని తెలిపింది. మెటా బ్లూ టిక్‌ ఫీచర్‌ ఇప్పటికైతే అమెరికా యూజర్లకే అందుబాటులో ఉంది.

ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ సౌకర్యం పొందాలంటే సదరు వ్యక్తి వయస్సు 18 ఏళ్లు దాటాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్లూ టిక్‌ వెరిఫికేషన్‌ లభించిన వారు ఏ ఫీజు చెల్లించనవసరం లేదు. త్వరలో ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ ఫీచర్‌ అమల్లోకి తేవడానికి సన్నాహాలు చేస్తున్నది మెటా.

Read more RELATED
Recommended to you

Exit mobile version