SBIలో పెన్షన్ అకౌంట్ NPS తీసుకుంటే… ట్యాక్స్ బెనిఫిట్స్ ఇలా ఉంటాయి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవలను వలన చాలా మందికి ప్రయోజనం కలుగుతోంది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం లో జాతీయ పింఛను పథకం బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా తమ కస్టమర్లు చక్కటి లాభాలని అందిస్తోంది. కస్టమర్లు ట్యాక్స్ సేవింగ్స్ అవకాశాలను అందిస్తోంది. వాలంటరీ రిటైర్‌మెంట్ సేవింగ్స్ స్కీమ్. రిటైర్ అయ్యాక పెన్షన్ రూపం లో వారికి ఆర్థికంగా భరోసా ఇస్తారు.

పీఎఫ్ఆర్‌డీఏ నేషనల్ పెన్షన్ స్కీమ్‌ నిర్వహణ, నియంత్రణ ని చూస్తుంది. తక్కువ ఖర్చు తో పెన్షన్ అందిస్తున్న స్కీమ్ ఇది. అందుకే చాలా మంది ఈ స్కీమ్ లో డబ్బులు పెడుతూ వుంటారు. సబ్‌స్క్రైబర్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు, పెన్షన్ ఫండ్ ని స్వయంగా ఎంచుకుంటారు. ఆ వెసులుబాటు ఉంటుంది ఈ స్కీమ్ లో. నేషనల్ పెన్షన్ స్కీమ్స్ లో రెండు రకాలని ఇస్తుంది స్టేట్ బ్యాంక్. ఒకటి టైర్ 1 ఇది పెన్షన్ అకౌంట్ దీనిని తప్పని సరిగా తీసుకోవాల్సి వుంది. ఇంకోటి వచ్చేసి టైర్ 2 అకౌంట్. ఇది ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్, ఇది ఆప్షనల్. టైర్ 1 కోసం రూ.500 కట్టాలి. టైర్ 2 అకౌంట్ తీసుకునేందుకు కనీసం రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.

18 నుంచి 70 ఏళ్ల వయసు వాళ్ళెవరైనా అర్హులే. టైర్-1ఖాతా తీసుకున్న ఉద్యోగులకు వారు జమ చేసే మొత్తంపై ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 80సీసీడీ (1బీ) బెనిఫిట్ ని పొందొచ్చు. సుమారు రూ.50 వేల వరకు ప్రయోజనం ఉంటుంది. 80సీసీఈ ప్రకారం రూ.1.50 లక్షల వరకు పెట్టుబడుల పై (10 శాతం బేసిక్ శాలరీ, డీఏ) ట్యాక్స్ డిడక్షన్ ని వీళ్ళు పొందొచ్చు. అలానే (బేసిక్ శాలరీ ప్లస్ డీఏ)పై 10 శాతం ఆదాయపు పన్ను చట్టం 80సీసీడీ(2) కింద ట్యాక్స్ డిడక్షన్ ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version