హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. మెట్రో కీలక నిర్ణయం

-

హైదరాబాద్‌ వాసులకు మెట్రో రైలు సేవలు మరింత సులభతరం చేసేందుకు మెట్రోరైల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ బిజినెస్‌తో మెట్రో రైల్ సర్వీస్ ప్రొవైడర్లు పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకుంది. దేశంలో గల ప్రధాన నగరాల్లోని మెట్రో సంస్థలతో ఈ ఒప్పందం కుదిరింది. ఇక వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో రవాణా పరిష్కారాలను కూడా చూపెట్టబోతుంది. ఈ కొత్త ఫీచర్‌ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా మెట్రో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం నుంచి టికెట్‌ను తక్షణమే కొనుగోలు చేయడం, క్యాన్సిల్ చేయడం, టాప్‌‌అప్ చేసుకోవడం, స్మార్ట్ కార్డ్స్ రీచార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ట్రైన్ల షెడ్యూల్, రూట్ మ్యాప్స్, ఫేర్ బ్రేక్‌డౌన్స్ సహా ఇంకెన్నో సర్వీసుల్ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ బిజినెస్ బెంగళూరు, ముంబయి, పుణె, హైదరాబాద్ మెట్రో సంస్థలతో చేతులు కలిపింది.

దీని ద్వారా హైదరాబాద్, బెంగళూరు, పుణె, ముంబయి ప్రయాణికులకు డిజిటల్ మెట్రో రైల్ సేవల్ని అందించనుంది. బెంగళూరులో ప్రయాణికులు NammaMetroను ఉపయోగించి ఇంగ్లీష్ లేదా కన్నడలో సేవల్ని పొందే అవకాశం ఉంటుంది. ఎండ్ టు ఎండ్ క్యూఆర్ టికెటింగ్ సర్వీసులతో టికెట్లను కొనుగోలు చేయడం, క్యాన్సిల్ చేయడం సహా టికెట్ల ధరలు తెలుసుకోవడం, కార్డు సమాచారం తెలుసుకోవడం, కార్డు రీఛార్జ్ చేసుకోవడం చేయొచ్చని తెలిపింది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు వాట్సాప్ చాట్‌బాట్ నుంచి ఈ- టికెట్లు బుక్ చేసుకోవడం కోసం యూఆర్‌ఎల్ పొందొచ్చు. 5 నిమిషాలు దీనికి వ్యాలిడిటీ ఉంటుంది.

 

ప్రస్తుతం బెంగళూరులో ఈ సేవలు అందుబాటులోకి రాగా, హైదరాబాద్ ప్రయాణికులకు అతిత్వరలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా వాట్సాప్ బిజినెస్ మెసేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా రవి గార్గ్ మాట్లాడుతూ, డిజిటల్ విప్లవం ఇప్పుడు భారతదేశ ప్రజా రవాణాను సురక్షితంగా, తెలివిగా, మరింత సౌకర్యవంతంగా మారుస్తోందన్నారు. అనేక నగరాల్లో భారతదేశం ప్రపంచ స్థాయి మెట్రో సేవలు ఇప్పుడు వాట్సాప్‌లో ఏకీకృతం కావడం తమకు గర్వకారణం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version