Breaking : సాంకేతిక లోపం.. మరోసారి నిలిచిపోయిన హైదరాబాద్‌ మెట్రో

-

హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా రవాణార్థం తీసుకువచ్చిన మెట్రో ట్రైన్‌లు మొరాయిస్తుండటంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తాజాగా లక్డీకపూర్‌ మెట్రో స్టేషన్‌లో సుమారు 15 నిమిషాల పాటు మెట్రో రైలు నిలిచిపోయింది. అయితే.. ట్రైన్‌ నిలిచిపోవడానికి సాంకేతిక లోపమే కారణమని అంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే… ఈ నెల 4 తేదీన రైళ్లు ఉదయం చాలా సమయం పాటు కదల్లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో ఏర్పడిన లోపమే ఇందుకు కారణమని తెలుస్తుండగా.. దాన్ని సరిదిద్దేందుకు మెట్రో అధికారులు శ్రమించినట్లుగా తెలుస్తోంది.

 

రైళ్లు ఎక్కిన వారు గమ్యస్థానాలకు చేరాల్సిన సమయంలో చేరలేని పరిస్థతి ఏర్పడింది. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే పని ఉన్నారు మెట్రో అధికారులు. సాంకేతిక లోపంతో 45 నిమిషాలకు పైగా మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వీలైనంత త్వరగా సర్వీసులను పునరుద్ధరించేందుకు హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగా మెట్రో సర్వీసులు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మెట్రో స్టేషన్ల వద్ద వేచి ఉన్న ప్రయాణికులు ఈ విషయమై మెట్రో రైల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version