సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ వార్త వచ్చింది అది నిజామా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.
కల్తీ పాల వలన క్యాన్సర్ వస్తుందని… 2025 నాటికి 87% మంది భారతీయులకి క్యాన్సర్ వచ్చేస్తుందని ఆ వార్త లో వుంది. మరి నిజంగా 2025 నాటికి 87% మంది భారతీయులకి క్యాన్సర్ వచ్చేస్తుందా..? దీనిలో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.
కల్తీ పాల వలన క్యాన్సర్ వస్తుందని వచ్చిన వార్త లో నిజం ఏమి లేదు. ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనిని చెబుతోంది అంటూ ఈ ఫేక్ మెసేజ్ లో ఉంది. ఎనిమిదేళ్లలో క్యాన్సర్ బారిన చాలా మంది పడతారని దీని వల్ల ముప్పు కలుగుతుందని అనడం ఫేక్ వార్త మాత్రమే.
क्या विश्व स्वास्थ्य संगठन ने एडवाइजरी जारी कर कहा है कि भारत में उपलब्ध दूध में मिलवाट के कारण 8 सालों में 87% भारतीयों को कैंसर हो जाएगा❓#PIBFactCheck
▪️ नहीं ‼️
▪️ यह दावा फ़र्ज़ी है।
▪️ @WHO ने ऐसी कोई एडवाइजरी जारी नहीं की है।
🔗https://t.co/F1LYhcWQEn pic.twitter.com/1zXkgpHboH
— PIB Fact Check (@PIBFactCheck) October 18, 2022
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే విషయాన్ని చెప్పలేదు. పాలు కల్తీ అవడం వలన ఈ సమస్యలు రావని అంటోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వార్తను పంపలేదు ఇది వట్టి ఫేక్ వద్ద మాత్రమే. ఇలాంటి వార్తలను నమ్మి అనవసరంగా మోసపోకండి.