నేను ఎక్కువ కాలం బతకను.. షాకింగ్ కామెంట్స్ చేసిన అక్బరుద్దీన్

-

కరీంనగర్ లో జరిగిన ఎంఐఎం సభలో పాల్గొన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలియదు. నేను ఎక్కువ కాలం బతకనని డాక్టర్లు కూడా చెప్పారు. అయితే.. నేను భయపడేది నా చావు గురించి కాదు. రాబోయే తరాల గురించే నా భయమంతా. కరీంనగర్ లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్ గా ఉన్న సమయంలో బీజేపీ అడ్రస్ కూడా లేకుండా పోయింది. కానీ.. ఇప్పుడు కరీంనగర్ లో బీజేపీ జెండ ఎగిరింది. ఏకంగా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. మజ్లీస్ గెలవలేదని నాకు ఎలాంటి బాధా లేదు.

కానీ… బీజేపీ గెలిచిందనే నా బాధ. మీరు మజ్లీస్ కు ఓటేయకపోయినా పర్వాలేదు. మజ్లీస్ ను గెలిపించకపోయినా పర్వాలేదు. కానీ… బీజేపీకి మాత్రం ఓటేయకండి. బీజేపీని మాత్రం గెలిపించకండి.. అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు అక్బరుద్దీన్.

ఇవాళ కరీంనగర్ లో జరిగిన ఎంఐఎం సభలో పాల్గొన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు.

మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు నేరుగా స్వర్గానికి వెళ్తారు. కానీ.. ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారు. ఎంఐఎంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. అంటూ అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

గత కొంత కాలంగా అక్బరుద్దీన్ అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఇటీవలే లండన్ లో చికిత్స చేయించుకొని వచ్చారు. గతంలో ఆయనపై జరిగిన దాడిలో బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లాయి. అయితే.. డాక్టర్లు శస్త్రచికిత్స చేసి కొన్ని బుల్లెట్లు తీశారు కానీ.. మరికొన్ని బుల్లెట్లను తీయలేకపోయారని.. వాటిని తీస్తే అక్బరుద్దీన్ ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెప్పినట్టు సమాధానం. ఆతర్వాత అక్బరుద్దీన్ కోలుకున్నప్పటికీ.. మళ్లీ అనారోగ్యం పాలయ్యారని.. అందుకే.. ఇలా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అక్బరుద్దీన్.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు. ప్రస్తుతం అసదుద్దీన్ ఎంఐఎంకు అధినేతగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version