హైడ్రా పేరుతో ఫిరోజ్ ఖాన్ వసూళ్లు చేసినందుకే దాడి చేశాం – ఎంఐఎం ఎమ్మెల్యే

-

ఫిరోజ్ ఖాన్ పై దాడి చేయడం పై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ స్పందించారు. ఈ సంఘటన పై ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. హైడ్రా పేరుతో ఫిరోజ్ ఖాన్ వసూళ్లు చేసినందుకే దాడి చేశామన్నారు. నాంపల్లి – సయ్యద్ నగర్‌లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్.

MIM MLA Majid Hussain reacted to the attack on Feroze Khan

ఫిరోజ్ ఖాన్ ఇలాంటి వసూళ్లు చేస్తూ తిరిగితే చెప్పులతో కొడతామని హెచ్చరించారు ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరులు హైడ్రా పేరుతో బెదిరించి డబ్బులు అడుగుతున్నట్లు రెండు రోజుల కిందట వార్తలు వచ్చాయి. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని సయ్యద్ నగర్ మిలటరీ ఏరియాలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అనుచరులు వచ్చి హైడ్రా సర్వే పేరుతో బెదిరిస్తున్నారని వార్తలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version