మునుగోడు ‘మనీ’ వార్..1000 కోట్లకు తగ్గేదేలే..!

-

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూలేని విధంగా మునుగోడు ఉపఎన్నిక..కాస్ట్‌లీ ఎన్నిక కానుందా? ఈ ఉపఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టనున్నాయా? తెలంగాణ చరిత్రలో లేని విధంగా ముందుగోడు ఉపఎన్నిక ఖర్చు వెయ్యి కోట్లు అవ్వనుందా? డౌట్ లేకుండా అవుననే అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఎన్నికలకు పెద్ద ఖర్చు పెట్టేవారు కాదు. ఏపీలోనే భారీ ఖర్చు అయ్యేది.

తెలంగాణలో కొద్దో గొప్పో ఖర్చు పెట్టేవారు తప్ప..వందల కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు లేవు. కానీ రాష్ట్రంలో ఎప్పుడైతే టీఆర్ఎస్-బీజేపీల మధ్య యుద్ధం మొదలైందో అప్పటినుంచి ప్రతి ఎన్నికకు కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఎన్నికల సంఘం అధికారికంగా ఒకో పార్టీకి రూ.40 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలని పర్మిషన్ ఇచ్చింది. కానీ పార్టీలు మాత్రం 40 లక్షలు కాదు..40 కోట్లు కాదు..400 కోట్ల వరకు వెళ్లిపోయేలా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నిక ఖర్చు దగ్గరగా దగ్గరగా 600 కోట్లు అయిందని అంచనా వేశారు.

ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక హుజూరాబాద్‌ని బీట్ చేస్తుందని అంటున్నారు. ప్రధాన పార్టీలు ఇప్పటికే ఓటు కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టేశాయని, అలాగే ఇతర పార్టీ నాయకులని లాక్కోవడానికి భారీగా ఖర్చు పెడుతున్నారని తెలిసింది. ఒక చిన్న కార్యకర్త పార్టీ మారితే రూ.30 వేలు ఇస్తున్నారంట..కార్యకర్తకే అలా ఉంటే..సర్పంచ్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, కౌన్సిలర్లు, మండల, నియోజకవర్గ స్థాయి నేతలకు ఎంత అందుతుందో చెప్పాల్సిన పనిలేదు.

ఇక ప్రతిరోజూ మందు, విందు అన్నట్లు రాజకీయం నడుస్తోంది. అలాగే కేవలం తొలి విడతలోనే వెయ్యి నుంచి రూ.10 వేల వరకూ పంచేస్తే..ఎన్నిక దగ్గరకొచ్చే సమయానికి ఓటు రేటు ఎంత పలుకుతుందో ఊహాకే అందడం లేదు. అయితే ఓటు కొనడంలో టీఆర్ఎస్-బీజేపీలు ముందు వరుసలో ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు..పైకి ఏమో రెండు పార్టీ నేతలు కోట్లు పెట్టి ఓట్లు కొనడానికి రెడీ అవుతున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ ఈ రెండు పార్టీలే భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా తమకు తగ్గట్టుగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్నిక ముగిసే సరికి మునుగోడు ఉపఎన్నిక ఖర్చు వెయ్యి కోట్లు దాటేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలోనే కాదు..దేశంలోనే కాస్ట్‌లీ ఎన్నిక అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version