సీఎం జగన్ ప్లాన్ ను లీక్ చేసిన మంత్రి ఆదిమూలపు

-

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో మూడు రాజధానులు నిర్మించేందుకు పట్టు పట్టింది. అయితే మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో బిల్లు పెట్టినా.. పలు కారణాల వల్ల ఆ బిల్లును ఉపసంహరించుకున్నారు. అయితే మూడు రాజధానుల నిర్ణయం ఇంకా ఉందని వీలు దొరికినప్పుడల్లా వైసీపీ నేతలు చెబుతూనే ఉంటారు.. అయితే ఈ మధ్య సీఎం జగన్ కూడా.. హై కోర్ట్ న్యాయమూర్తులతో ప్రత్యేకంగా సమావేశమై.. మూడు రాజధానుల్లో ఒకటైన.. న్యాయ రాజధాని గురించి చేర్చించినట్లు సమాచారం. ఈ విషయానికి బలం చేకూరుస్తూ.. మంత్రి ఆదిమూలపు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.. క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధాని వ‌చ్చేసింద‌ని ఆయ‌న చెప్పారు.

ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్ప‌కూడ‌దంటూనే… క‌ర్నూలుకు జ్యుడిషియ‌ల్ కేపిట‌ల్ వ‌చ్చేసింద‌ని అన్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ఇప్పుడే ప్ర‌క‌టించ‌కూడ‌ద‌ని కూడా సురేశ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఆగ‌స్టు 15 త‌ర్వాత ఏపీలో ఊహించ‌ని ప‌రిణామాలు జ‌ర‌గ‌బోతున్నాయ‌ని చెప్పిన మంత్రి సురేశ్.. ఏం జ‌ర‌గ‌బోతోందో మీరే చూస్తార‌ని కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వం అమ‌రావ‌తి చుట్టూ అభివృద్ధి అంటూ గ్రాఫిక్స్ చూపిస్తూ ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు పాల్ప‌డింద‌ని ఆయ‌న ఆరోపించారు మంత్రి ఆదిమూలపు.

Read more RELATED
Recommended to you

Exit mobile version